Prakasam District: పెండింగ్ లోవే కాదు, కావాలని పక్కన పెట్టిన పనులనూ పూర్తి చేస్తా: కరణం బలరాం హామీ

  • చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం బలరాం
  • ఈ నియోజకవర్గంపై నాకు పూర్తి అవగాహన ఉంది
  • ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా

ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీ, టీడీపీ ‘నువ్వా? నేనా?’ అన్నట్టు ఈ ఎన్నికల్లో తలపడనున్నాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి ఇటీవలే వైసీపీలో చేరారు. ఇక, టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో ఆమంచి, బలరాం పోటీ చేస్తున్నారు. ‘గెలుపు ఎవరిది?’ అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో కరణం బలరాంను మీడియా పలకరించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాల నియోజకవర్గం గురించి తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఇక్కడి చేనేతలు, యాదవులు, ఎస్సీ, ఎస్టీలు, రైతాంగానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, పెండింగ్ లో ఉన్న పనులే కాకుండా, కావాలని పక్కన పెట్టిన పనులను కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఈ నియోజకవర్గంలో ఎలాంటి హడావుడి లేదని, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అన్నారు. టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్న హామీని కచ్చితంగా నెరవేరుస్తానని చెప్పారు.

Prakasam District
chirala
Amanchi
karanam
  • Loading...

More Telugu News