Police: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన సర్కారు

  • కోర్టులో పిటిషన్ కొట్టివేత
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
  • పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు

రాష్ట్ర ఎన్నికల సమరాంగణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నిఘా విభాగం డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీచేశారు. వెంకటేశ్వరరావును పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలంటూ సూచించారు.

కొన్నిరోజుల క్రితం డీజీ వెంకటేశ్వరరావుతో పాటు కడప, శ్రీకాకుళం జిల్లాల పోలీసు బాస్ లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. కారణాలు చెప్పకుండా నిజాయతీపరులైన అధికారులను బదిలీ చేస్తున్నారంటూ టీడీపీ అధినాయకత్వం మండిపడింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది. ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో, డీజీ వెంకటేశ్వరావును కూడా బదిలీ చేసినట్టు అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News