vijay sethupathi: హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడట

  • విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి 
  • ప్రయోగాత్మకమైన పాత్రలపై ఆసక్తి
  • హిజ్రా పాత్రకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు  

తమిళంలో విజయ్ సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వీలైనంత వరకూ హీరోగా చేస్తూ .. ప్రాధాన్యత ఉంటే కీలకమైన పాత్రల్లో కనిపించడానికి కూడా ఆయన వెనుకాడటం లేదు. ఇలా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. సాధారణంగా హిజ్రా వేషాన్ని ధరించడానికి స్టార్ హీరోలు ఆలోచన చేస్తారు. ఆ పాత్రలో కనిపించడాన్ని ఒక సాహసంగానే భావిస్తారు.

అలాంటి సాహసాన్ని విజయ్ సేతుపతి చాలా తేలికగా చేసేశాడు. ఆయన హిజ్రా పాత్రను పోషించిన 'సూపర్ డీలక్స్' చిత్రం ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసినవాళ్లంతా .. హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడని అంటున్నారు. సాధారణ ప్రేక్షకులు .. అభిమానులు మాత్రమేకాదు, క్రిటిక్స్ కూడా ఆయన నటనకి నూటికి నూరు మార్కులు ఇచ్చేస్తున్నారు. ఆయన కెరియర్లో ఈ పాత్ర చెప్పుకోదగినదిగా నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే విజయ్ సేతుపతి ఖాతాలో మరో హిట్ చేరిపోయినట్టేనని అనిపిస్తోంది.

vijay sethupathi
  • Loading...

More Telugu News