Tamilnadu: తన కారును ఆపారంటూ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పై సినీ నటి నమిత ఆగ్రహం!

  • సేలం జిల్లాలో తనిఖీలు
  • నమిత కారులో సోదాలు జరిపిన అధికారులు
  • గొడవ పెట్టుకున్న నటి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో డబ్బు ప్రాధాన్యత గుర్తించిన అధికారులు నగదు అక్రమ రవాణాపై దృష్టి కేంద్రీకరించారు. అయితే,  తమిళనాడులోని సేలం జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. సేలం సమీపంలోని కొండలాంపట్టి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో అటుగా వచ్చిన సినీ నటి నమితను అధికారులు అడ్డగించారు. ఈ సందర్భంగా నమిత అధికారులతో గొడవ పెట్టుకుంది. తన కారును ఎందుకు ఆపారంటూ ప్రశ్నించింది.

ఫ్లయింగ్ స్క్వాడ్ కు నాయకత్వం వహిస్తున్న ఆనంద్ విజయ్ తాము ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోదాలు చేస్తున్నామని, ఎవరైనా సహకరించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. ఆనంద్ విజయ్ గట్టిగా మాట్లాడడంతో వెనక్కి తగ్గిన నమిత తన కారులో తనిఖీలు చేసేందుకు సమ్మతించింది. పూర్తిగా సోదాలు జరిపిన ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది అందులో అభ్యంతరకరమైనవి ఏమీ లేవని తేల్చారు. దాంతో, నమిత అక్కడ్నించి వెళ్లిపోయింది. ఆ సమయంలో కారులో నమితతో పాటు మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News