Narendra Modi: ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తప్పేం లేదు: ఈసీ క్లీన్‌చిట్
- అందులో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన లేదు
- పార్టీ పేరు, ఓటేయాలని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు
- యాంటీ శాటిలైట్ మిసైల్ ప్రయోగం విజయవంతమైందని మోదీ ప్రసంగం
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఎక్కడా లేదని కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్‌చిట్ ఇచ్చింది. మోదీ తన ప్రసంగంలో ఎక్కడా బీజేపీ గురించిగాని, తమ పార్టీకి ఓటేయాలని గాని ప్రస్తావించలేదని గుర్తు చేశారు.
భారత్ అభివృద్ధి చేసిన యాంటీ శాటిలైట్ మిసైల్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా మోదీ రెండు రోజుల క్రితం జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు విమర్శలు కురిపించాయి. ఇదేమీ దేశభద్రతకు సంబంధించిన అంశంకాదని, కానీ ప్రధాని పనిగట్టుకుని అదేదో బీజేపీ ప్రభుత్వ విజయంగా చెప్పుకొచ్చారని మాటల దాడి చేశాయి. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అంటూ ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై ఏర్పాటుచేసిన ప్యానెల్ ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం ఈ విధంగా క్లీన్‌చిట్ ఇచ్చింది.