MLC results: లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీ తరహా ఫలితాలే: ఉత్తమ్ కుమార్‌ జోస్యం

  • టీఆర్‌ఎస్‌కు పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్పారు
  • ఇది ప్రారంభం మాత్రమే
  • రాహుల్‌ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రానున్నాయని, టీఆర్‌ఎస్‌కు దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఈనెల 1వ తేదీన హుజూర్‌నగర్‌లో జరగనున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఎన్నికల్లో తమ తీర్పుతో పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్పారని సంతోషం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇది కొనసాగుతుందని, కాంగ్రెస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ కూటమి అత్యధిక స్థానాలు సాధించి రాహుల్‌ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

MLC results
Uttam Kumar Reddy
loksabha pols
hururnagan
  • Loading...

More Telugu News