Rahul Gandhi: గెలిస్తే అన్న రాహుల్ దే ప్రధాని పదవి... స్పష్టం చేసిన ప్రియాంక వాద్రా

  • అమేథీ పర్యటన సందర్భంగా తేల్చిచెప్పిన ప్రియాంక
  • ఇప్పటి వరకు దీనిపై ప్రకటన చేయని గాంధీ కుటుంబం
  • ఆ విషయం ప్రస్తావించని రాహుల్‌

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు? ఇప్పటి వరకు కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉన్న సందేహం ఇది. నిన్నమొన్నటి వరకు రాహుల్‌ గాంధీయే పార్టీలో ప్రధాన ఆకర్షణ. దీంతో ఆయనే అనుకునే వారు. ఇటీవలే ప్రియాంక రాజకీయ అరంగేట్రం చేశారు. దీంతో అన్నాచెల్లెళ్లలో ఎవరిదా పదవి? అన్న చర్చ మొదలయింది. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అన్న రాహుల్‌ గాంధీయే ప్రధాని అవుతారని ప్రియాంకవాద్రా స్పష్టం చేసి సందేహాలకు తెరదించారు.

గాంధీ కుటుంబం నుంచి ఇటువంటి ప్రకటన వెలువడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం అన్న సొంత నియోజకవర్గమైన అమేథీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంకవాద్రా 2019లో గెలిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని విస్పష్ట ప్రకటన చేశారు. విపక్ష కూటమిలోని పలు పార్టీల నేతలు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొన్నప్పటికీ ఆయన మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ఈ విషయంపై నోరు మెదపలేదు.

Rahul Gandhi
priyanka
Prime Minister
amedhi
  • Loading...

More Telugu News