Rahul Gandhi: తెలంగాణలో మరోరోజు పర్యటనకు రాహుల్‌ గ్రీన్‌ సిగ్నల్‌

  • ఏప్రిల్‌ ఒకటి, 8వ తేదీల్లో పర్యటిస్తానని పార్టీ వర్గాలకు సమాచారం
  • ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు
  • తొలుత ఒక రోజు పర్యటనకే ఓకే అన్న కాంగ్రెస్‌ చీఫ్‌

తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు పర్యటించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈమేరకు పార్టీ నాయకత్వానికి సమాచారం ఇస్తూ అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ ఒకటిన రాహుల్‌ తెలంగాణలో పర్యటించనున్నారు. జహీరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో సభల నిర్వహణకు టీపీసీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది.

అయితే ఏప్రిల్‌ ఎనిమిదో తేదీన కూడా రాహుల్‌ రాష్ట్రంలో రెండో విడత పర్యటిస్తారని, ఎక్కడ సభలు నిర్వహించాలో నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకోవాలని ఢిల్లీ వర్గాలు టీపీసీసీకి సమాచారం ఇచ్చాయి. దీంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో కాంగ్రెస్‌ పెద్దలు నిమగ్నమై ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో 9వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది.

Rahul Gandhi
TPCC
election tour
  • Loading...

More Telugu News