Priyanka gandhi: మోదీ వర్సెస్ ప్రియాంక.. మోదీపై పోటీకి సై అంటున్న ప్రియాంక గాంధీ?

  • రాయబరేలీ ప్రచారంలో మనసులో మాట బయటపెట్టిన ప్రియాంక
  • కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్
  • ఆహ్వానించి ఎద్దేవా చేసిన బీజేపీ

అధిష్ఠానం ఆదేశిస్తే ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమని రెండు రోజుల క్రితం ప్రకటించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి (తూర్పు యూపీ) ప్రియాంక గాంధీ ఇప్పుడు మోదీపై బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ వారణాసి నుంచే బరిలోకి దిగుతున్న మోదీకి పోటీగా ప్రియాంక గాంధీ కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

గురువారం రాయబరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియాంక తన ఉద్దేశాన్ని బయటపెట్టారు. మీరు ఇక్కడి నుంచే పోటీ చేయాలంటూ కార్యకర్తలు చేసిన నినాదాలకు ప్రియాంక స్పందిస్తూ.. ‘వారణాసి నుంచి వద్దా’ అని ప్రశ్నించారు. ‘మీ ఇష్టం ఎక్కడి నుంచైనా ఓకే’ అని కార్యకర్తలు అనడంతో ‘వారణాసి నుంచి పోటీ చేయనా?’ అని తిరిగి ప్రశ్నించారు.

ప్రియాంక చేసిన తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. వారణాసి ఎన్నికలు మోదీ వర్సెస్ ప్రియాంకగా మారడం ఖాయమని  చెబుతున్నారు. మరోవైపు ప్రియాంక వ్యాఖ్యలను బీజేపీ కూడా స్వాగతించింది. వారణాసి నుంచి పోటీ చేసి తొలి పోటీలోనే ఓడిన నేతగా రికార్డులకెక్కొచ్చంటూ ఎద్దేవా చేసింది.

Priyanka gandhi
Congress
Varanasi
Uttar Pradesh
Narendra Modi
  • Loading...

More Telugu News