Lakshmi's Veeragrandham: ఏప్రిల్ 8న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’.. దర్శక నిర్మాత కేతిరెడ్డి ప్రకటన

  • ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
  • సినిమాను ఆపాలంటూ కొందరు కోర్టుకు
  • విడుదలకు అడ్డంకులు లేవన్న దర్శకుడు కేతిరెడ్డి

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు ఏపీ హైకోర్టు స్టే  విధించింది. అయితే, తెలంగాణలో మాత్రం విడుదలకు ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో ముందుగా ప్రకటించిన ప్రకారమే నేడు సినిమా విడుదల కానుంది.

మరోవైపు ఈ సినిమాకు పోటీగా మరో దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి రూపొందించిన ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. కొందరు ఈ సినిమా విడుదలపైనా కోర్టును ఆశ్రయించారు. అయితే సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, వచ్చే నెల 8న సినిమా విడుదల చేయనున్నట్టు కేతిరెడ్డి తెలిపారు.

Lakshmi's Veeragrandham
Kethireddy
Tollywood
Andhra Pradesh
High Court
  • Loading...

More Telugu News