Jana sena: ఆరోజు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో!: పవన్ కల్యాణ్

  • ‘పంచెలూడ దీసి కొడతా’ వ్యాఖ్యల ప్రస్తావన
  • ఆ మాట నేను అనలేదు
  • భావోద్వేగంలో జరిగిన పొరపాటు అది

గతంలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన  ‘యువ రాజ్యం’ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ ఉన్న సమయంలో ‘పంచెలూడ దీసి కొడతా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయి. ఆరోజున తాను అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంటుందని అన్నారు. నాటి విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ వద్ద ప్రస్తావించగా ఆసక్తికర సమాధానమిచ్చారు.

 ‘పంచె లూడదీసి కొడతానని నేను అనలేదు. ‘పంచెలూడి పోయేలా తరిమి కొట్టండి’ అని అన్నాను. నిజంగా, అంత కూడా నేను మాట్లాడను. ఆ మాట సరైందా? కాదా? అని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను. భావోద్వేగంలో వచ్చిన మాట, చిన్న పొరపాటు అనుకుంటాను’ అని స్పష్టం చేశారు.

Jana sena
Pawan Kalyan
praja rajyam
yuva rajyam
  • Loading...

More Telugu News