Medak District: పేదల పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే ‘కాంగ్రెస్’ పని: హరీశ్ రావు

  • ‘గరీబీ హఠావో’ నినాదాన్నే రాహుల్  చెబుతున్నారు
  • పేదలు ఇంకా పేదలుగానే ఎందుకు ఉన్నారు?
  • కొత్తపేట ప్రభాకర్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ ఖాయం

పేదల పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్ పార్టీ పని అని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ లో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరీశ్ రావు పాల్గొన్నారు. 1971లో ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ఆయన ప్రస్తావించారు. రాహుల్ గాంధీ కూడా ఇప్పటికీ అదే నినాదాన్ని చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఆ నినాదం చేస్తున్న రాహుల్, పేదలు ఇంకా పేదలుగా ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎంపీ అభ్యర్థి కొత్తపేట ప్రభాకర్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Medak District
Tellapur
TRS
Harish Rao
kothapeta
prabhakar reddy
Congress
Rahul Gandhi
  • Loading...

More Telugu News