West Godavari District: హాస్యనటుడు రేలంగిలా లోకేశ్ తయారయ్యాడు: జనసేన నాయకుడు నాగబాబు సెటైర్లు

  • లోకేశ్ చేసే కామెడీ ముందు ‘జబర్దస్త్’ చాలదు
  • చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగా లేదు
  • ఎంపీగా నన్ను గెలిపిస్తే ఎంత అభివృద్ధి చేయాలో చేస్తా

ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ పై నర్సాపురం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి నాగబాబు సెటైర్లు సంధించారు. పశ్చిమగోదావరి జిల్లా  తాడేపల్లి గూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హాస్యనటుడు రేలంగిలా లోకేశ్ తయారయ్యాడంటూ ఎద్దేవా చేశారు. లోకేశ్ చేసే కామెడీ ముందు ‘జబర్దస్త్’ ఏమాత్రం చాలదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగా లేదని అన్నారు. తాడేపల్లి గూడెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈలి నానీని విమర్శించారు. నానీకి నవ్వడమే తప్ప ఏ పనీ చెయ్యడం చేతకాదని అన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే, ఒక ఎంపీ ఏమేమి అభివృద్ధి పనులు చేయగలడో అవన్నీ చేసి చూపిస్తానని అన్నారు. 

West Godavari District
Tadepalli gudem
Jana Sena
Naga Babu
Telugudesam
Chandrababu
Nara Lokesh
  • Loading...

More Telugu News