nizamabad: నిజామాబాద్ లో ఈవీఎంలు ఉపయోగించం.. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు: రజత్ కుమార్

  • నిజామాబాద్ ఎన్నికల బరిలో 185 మంది
  • ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించలేం
  • బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ కు ఎన్ని రోజులు పడుతుందో?

తెలంగాణలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 185 మంది ఎన్నికల బరిలో నిలిచారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో, ఇక్కడ పోలింగ్ కోసం ఈవీఎంలను ఉపయోగించలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. పేపర్ బ్యాలెట్ ద్వారానే పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ కు ఎన్నిరోజులు పడుతుందో తెలియదని అన్నారు. అందుబాటులో ఉన్న వనరులు, ఇతర అంశాలపై చర్చిస్తున్నామని చెప్పారు. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నారు.

nizamabad
lok sabha
ballet paper
polling
  • Loading...

More Telugu News