Chandrababu: టీడీపీకి తెలంగాణ ఎన్నికల్లో పట్టిన గతే, ఏపీలోనూ పడుతుంది!: జీవీఎల్

  • కనీసం 18 సీట్లు కూడా రావు
  • 52 స్థానాలే ఉన్నాయని సీమను పట్టించుకోవట్లేదు
  • మమతకు పట్టిన గతే పడుతుంది

టీడీపీకి తెలంగాణ ఎన్నికల్లో పట్టిన గతే, ఏపీ ఎన్నికల్లోనూ పడుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీమలో 52 స్థానాలే ఉన్నాయని టీడీపీ పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే మమతా బెనర్జీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

ఈ ఎన్నికల్లో మంత్రులంతా ఓడిపోతారని, టీడీపీకి కనీసం 18 సీట్లు కూడా రావని జీవీఎల్ జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ శుక్రవారం కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Chandrababu
GVL Narasimha Rao
Telugudesam
BJP
Narendra Modi
  • Loading...

More Telugu News