Jupudi Prabhakar: బీజేపీ మాయలో పడి ఈసీ వెన్నెముక లేని వ్యవస్థగా మారింది: జూపూడి ప్రభాకర్

  • బీజేపీ డైరెక్షన్‌లో ఈసీ పని చేస్తోంది
  • ఏపీపై కక్ష కట్టింది
  • వైసీపీ కరపత్రంలా సాక్షి మీడియా 

బీజేపీ మాయలో పడి వెన్నెముక లేని వ్యవస్థగా ఎన్నికల సంఘం మారిందని, ఈసీని ఇలా తాము చూడదల్చుకోలేదని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నేడు టీడీపీ ఎంపీ కనకమేడలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ డైరెక్షన్‌లో ఈసీ పనిచేస్తోందని, ఏపీపై కక్ష కట్టిందని ఆరోపించారు. ఈసీ చేతల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని, వైసీపీ ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు.

సాక్షి మీడియా వైసీపీ కరపత్రంలా మారిందని టీడీపీ ఎంపీ కనకమేడల వ్యాఖ్యానించారు. సాక్షి మీడియాలో వచ్చే కథనాలపై చర్యలు తీసుకోవాలని, దానిలో వచ్చిన కథనాలను పెయిడ్ ఆర్టికల్స్‌గా గుర్తించాలని అన్నారు.  

Jupudi Prabhakar
MP Kanakamedala
Sakshi media
Election Commission
Telugudesam
  • Loading...

More Telugu News