cbi: వైయస్ వివేకా అప్పుడు నాకు సారీ చెప్పారు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • పయ్యావుల కేశవ్ తో నాకు బంధుత్వం ఉందని వివేకా ఆరోపించారు
  • వేరే వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అలా అన్నానని నాతో చెప్పారు
  • వివేకా వ్యక్తిత్వం చాలా గొప్పది

దివంగత వైయస్ వివేకానందరెడ్డి వ్యక్తిత్వం చాలా గొప్పదని సీబీఐ మాజీ జేడీ, జనసేన నాయకుడు లక్ష్మీనారాయణ కితాబిచ్చారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో జరిగిన ఓ సంఘటనను ఆయన ప్రస్తావించారు. వైసీపీ అధినేత జగన్ కేసును విచారిస్తున్న సమయంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు, తనకు బంధుత్వం ఉందని వివేకా ఆరోపించారని చెప్పారు.

ఆ తర్వాత ఆయన తనకు ఫోన్ చేసి... తప్పైంది బాబూ, వేరే వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు తాను అలా మాట్లాడానని చెప్పారని అన్నారు. మీ అఫీసుకు వచ్చి క్షమాపణలు చెబుతానని అన్నారని తెలిపారు. వేరేవాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు మీరు అలా మాట్లాడారని... ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవద్దని ఆయనకు తాను చెప్పానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా తనకు సంబంధం లేదని... తిత్లీ తుపాను సమయంలోనే ఆయనను తాను తొలిసారి కలుసుకున్నానని చెప్పారు.

cbi
lakshminarayana
ys viveka
janasena
ysrcp
chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News