kumaraswamy: ఇవి మోదీ నిజమైన సర్జికల్ స్ట్రయిక్స్: కుమారస్వామి

  • జేడీఎస్, కాంగ్రెస్ ప్రధాన నేతలపై ఐటీ దాడులు
  • మోదీపై మండిపడ్డ కుమారస్వామి
  • ఇలాంటి వాటికి భయపడబోమంటూ వ్యాఖ్య

కర్ణాటకలో ఐటీ దాడుల ద్వారా ప్రధాని మోదీ రియల్ సర్జికల్ స్ట్రయిక్స్ బయటపడ్డాయని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఎన్నికల సమయంలో అవినీతి అధికారులు, ప్రభుత్వ యంత్రాగాన్ని ఉపయోగించుకుని రాజకీయ కక్షకు మోదీ పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అచేతనం చేసే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా... తాను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాదిరి ప్రతిస్పందిస్తానని కుమారస్వామి ప్రకటించిన గంటల వ్యవధిలోనే జేడీఎస్-కాంగ్రెస్ నేతలు, మద్దతుదారులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి స్పందిస్తూ, పైవ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలోని జేడీఎస్, కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు మోదీ ఐటీ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని కుమారస్వామి విమర్శించారు. తమ పార్టీలకు చెందిన ప్రధాన నేతలపై ఐటీ దాడులు చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.

kumaraswamy
karnataka
jds
congress
it
raids
modi
bjp
  • Loading...

More Telugu News