Andhra Pradesh: దేవినేని అవినాశ్ మంచిమనసు.. గాయపడ్డ వ్యాపారిని ఆసుపత్రికి తరలించిన టీడీపీ నేత!

  • కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ఘటన
  • రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జామకాయల వ్యాపారి
  • అవినాశ్ స్పందించిన తీరుపై స్థానికుల ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత దేవినేని అవినాశ్ తన సహృదయతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ చిరు వ్యాపారిని ఆసుపత్రికి తరలించారు. ఖర్చుల కోసం సదరు వ్యాపారికి కొంత నగదును అందజేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని బుడమేరు వద్ద చోటుచేసుకుంది.

ఈరోజు దేవినేని అవినాశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడలో పర్యటిస్తున్నారు. అంతకుముందు బుడమేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జామకాయల వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళుతున్న అవినాశ్ వాహనాన్ని ఆపి ఘటనాస్థలానికి చేరుకున్నారు.

సదరు వ్యాపారిని స్థానికుల సాయంతో వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఖర్చుల కోసం కొంత నగదును అందజేశారు. మరోవైపు వైద్యుల సూచనతో జామకాయల వ్యాపారిని గుడివాడకు తరలించారు. కాగా, అవినాశ్ స్పందించిన తీరుపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Andhra Pradesh
Telugudesam
devineni avinash
Krishna District
gudiwada
  • Loading...

More Telugu News