Andhra Pradesh: వైసీపీలో చేరిన సినీ రచయిత చిన్ని కృష్ణ.. జగన్ కండువా కప్పగానే భావోద్వేగంతో కన్నీరు!

  • పాలకొల్లు సభలో వైసీపీ తీర్థం
  • మాజీ ఎమ్మెల్యే రామారావు, దళిత నేత గురుప్రసాద్ చేరిక
  • చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్న జగన్

పశ్చిమగోదావరిలోని పాలకొల్లులో నిర్వహించిన సభలో వైసీపీ అధినేత జగన్ ఈరోజు పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దనీ, రాజన్న రాజ్యం తెచ్చుకుందామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పిల్లలందరినీ ఎంత ఖర్చయినా ఉచితంగా చదివిస్తామని జగన్ ప్రకటించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారనీ, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ  వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో భావోద్వేగానికి లోనైన చిన్ని కృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. చిన్ని కృష్ణతో పాటు ప్రముఖ ఎస్సీ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, దళిత నేత గురుప్రసాద్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ జగన్ వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Andhra Pradesh
YSRCP
Jagan
writer
Tollywood
chinni krishna
  • Loading...

More Telugu News