Abhisheik Mahanti: కడప జిల్లా కొత్త ఎస్పీగా అభిషేక్ ను నియమించిన ఈసీ

  • నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ
  • గతంలో కడపలో పనిచేసిన అభిషేక్
  • 2012 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అభిషేక్

రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మను బదలీ చేసిన ఎన్నికల కమిషన్, కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమిస్తూ, నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ దేవ్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, 2012 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అభిషేక్ మహంతికి గతంలో కడప జిల్లాలో పని చేసిన అనుభవముంది. గత సంవత్సరం నవంబర్ 2న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఫిబ్రవరి 14 వరకూ పనిచేసి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా బదిలీ అయ్యారు. తిరిగి ఆయన్నే ఎస్పీగా నియమించిన నేపథ్యంలో, రేపు ఆయన బాధ్యతలు స్వీకరించవచ్చని సమాచారం.

Abhisheik Mahanti
EC
YSR Kadapa
SP
  • Loading...

More Telugu News