Andhra Pradesh: అదానీలు కూడా ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారు.. అందుకు కారణం చంద్రబాబే!: నారా లోకేశ్

  • ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నాం
  • పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం అనుకూలం
  • విశాఖలో పారిశ్రామికవేత్తలతో మంత్రి భేటీ

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారత్ లో ఏపీకి ఓ ప్రత్యేకత ఉందని వ్యాఖ్యానించారు. అదానీ వంటి వ్యాపార దిగ్గజాలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారంటే అందుకు చంద్రబాబే కారణమని అభిప్రాయపడ్డారు. పరిశ్రమల స్థాపనకు ఏపీ చాలా అనుకూలమన్నారు. విశాఖ జిల్లాలో ఈరోజు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ భేటీ అయ్యారు.

రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని లోకేశ్ తెలిపారు. అన్నిరకాల పరిశ్రమలకు చేయూత ఇస్తున్నామని చెప్పారు. ఏపీలో ఉపాధి కల్పించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగంలో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

Andhra Pradesh
Nara Lokesh
Telugudesam
adani
Chandrababu
  • Loading...

More Telugu News