manda Krishna Madiga: నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం: మంద కృష్ణ మాదిగ విమర్శలు

  • మాదిగలను మోసం చేశారు
  • టికెట్ల విషయంలో మాలలకు పెద్దపీట
  • ఓటు ద్వారా బుద్ధి చెబుతామన్న మంద కృష్ణ

నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమని, మాదిగల విషయంలోనూ ఆయన అదే పని చేశారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, తాము అమరావతిలో విశ్వరూప మహాసభ నిర్వహించాలని అనుకుంటే, ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఆయన అన్నారు. మాదిగలను నమ్మించి ద్రోహం చేసిన చంద్రబాబుకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతామని అన్నారు. సీట్ల కేటాయింపులోనూ మాలలకు పెద్ద పీట వేస్తూ, మాదిగలకు టీడీపీ అన్యాయం చేసిందన్నారు. తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణను శుక్రవారం నాడు ప్రకటిస్తామని ఆయన అన్నారు.

manda Krishna Madiga
Chandrababu
Amaravati
  • Loading...

More Telugu News