Andhra Pradesh: ఎస్పీవై రెడ్డి ఇంటికి టీజీ వెంకటేశ్.. పోటీ నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి!

  • నంద్యాల లోక్ సభ నుంచి పోటీచేస్తున్న ఎస్పీవై రెడ్డి
  • బుజ్జగిస్తున్న టీజీ వెంకటేశ్ 
  • ఇంకా కొనసాగుతున్న చర్చలు

నంద్యాల లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఈరోజు ఎస్పీవై రెడ్డి ఇంటికి వచ్చారు. జనసేన తరఫున నామినేషన్ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనున్న నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. ఒకవేళ పోటీ నుంచి తప్పుకుంటే పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఈ విషయమై ఇరువురు నేతల మధ్య ఇంకా చర్చలు సాగుతున్నాయి.

Andhra Pradesh
Jana Sena
Telugudesam
spy reddy
tg venkatesh
  • Loading...

More Telugu News