Sudheep: కన్నడ హీరో సుదీప్ అరెస్ట్ తప్పదంటున్న శాండల్ వుడ్!

  • సుదీప్ ను చుట్టుముట్టిన కాఫీ తోట వివాదం
  • కోర్టు వాయిదాలకు హాజరుకాని సుదీప్
  • మే 22లోగా కోర్టు ముందుంచాలన్న న్యాయమూర్తి

కాఫీ తోట వివాదంలో కన్నడ హీరో, ఈగ ఫేమ్ కిచ్చ సుదీప్ పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. ప్రస్తుతం చిక్ మగళూరు కోర్టులో కాఫీ ఎస్టేట్ వివాదంపై విచారణ జరుగుతుండగా, ఒక్కసారి కూడా సుదీప్ వాయిదాకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన న్యాయమూర్తి, మే 22లోగా ఆయన ఎక్కడున్నాడో ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందుకు తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పుడు శాండర్ వుడ్ లో ఇదే హాట్ టాపిక్. ఆయన అరెస్ట్ తప్పదని పలువురు చర్చించుకుంటున్న పరిస్థితి.

కాగా, ఇక్కడికి సమీపంలోని కాఫీ తోటను అద్దెకు తీసుకున్న సుదీప్, రూ. 1.80 కోట్ల అద్దె చెల్లించాల్సివుండగా, అడ్వాన్స్ గా ఇచ్చిన రూ. 50 వేలు మినహా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నది ఆయనపై ఆరోపణ. దీంతో పాటు కాఫీ తోటలను ఆయన ధ్వంసం చేయించారని, ఒప్పందానికి భిన్నంగా సెట్ ను వేసుకున్నారని దాని యజమాని దీపక్ పటేల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News