Telangana: తెలంగాణలో మరింతగా పెరగనున్న ఉష్ణోగ్రతలు... కోస్తాలో వర్షాలకు చాన్స్!
- ఇప్పటికే మండుతున్న ఎండలు
- మరో మూడు డిగ్రీల వరకూ పెరిగే అవకాశం
- దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు మండుతుండగా, రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే, మూడు డిగ్రీల వరకూ అధికం కావచ్చని తెలిపారు. దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా, దీని ప్రభావంతో కోస్తా రీజియన్ లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.