Tamannaah: విక్కీ కౌశల్‌తో డేటింగ్ కి వెళ్లాలనుంది: తమన్నా

  • అనుభవాలను చర్చించుకునేందుకే ‘మీటూ’
  • మాట్లాడాలంటే ధైర్యం కావాలి
  • ఒక్కోసారి ఆటలా మారిపోతోంది

డేటింగ్‌కి వెళ్లే అవకాశం వస్తే ఎవరితో వెళ్తారని మిల్కీ బ్యూటీ తమన్నాను అడిగితే బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో వెళ్తానంటూ కుండబద్దలు కొట్టేసింది. తాజాగా తమన్నా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. విక్కీ నటించిన ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రయిక్‌’ సినిమా చూశానని, తన నటనతో విక్కీ ఆకట్టుకున్నాడని తెలిపింది.

అనంతరం మీటూ ఉద్యమంపై స్పందించిన మిల్కీబ్యూటీ, తమకు ఎదురైన అనుభవాల గురించి మాత్రమే చర్చించుకోవడానికి మీటూ ఉద్యమం ఉందని తెలిపింది. దీని గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలని, కానీ ఒక్కోసారి ఇది ఆటలా మారిపోతోందని వ్యాఖ్యానించింది. మీటూ ఉద్యమాన్ని మరింత సీరియస్‌గా తీసుకుని ఉంటే, చిత్ర పరిశ్రమలో మనం అనుకున్న మార్పులను చూసి ఉండేవాళ్లమని తెలిపింది.

Tamannaah
Mee too
Vicky koushal
Interview
Vuri: The Surgical Strike
  • Loading...

More Telugu News