Andhra Pradesh: సీఎం భద్రత చూసే అధికారిని బదిలీ చేస్తే ఎలా?: జూపూడి

  • పోలీస్ అధికారుల బదిలీపై సీఈసీ వివరణ కోరిన టీడీపీ 
  • చంద్రబాబు భద్రతకు ఈసీ బాధ్యత వహిస్తుందా?
  • రాజ్యాంగ విరుద్ధంగా సీఈసీ వ్యవహరిస్తోందన్న జూపూడి

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సహా శ్రీకాకుళం, కడప జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వివరణ కోరేందుకు టీడీపీ నేతలు సీఎం రమేశ్, జూపూడి ప్రభాకర్, ఎంపీ కనమేడల రవీంద్రకుమార్ ఈరోజు సీఈసీని కలిశారు. అనంతరం, జూపూడి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం భద్రత చూసే అధికారిని బదిలీ చేస్తే ఎలా? చంద్రబాబు భద్రతకు ఈసీ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధంగా సీఈసీ వ్యవహరిస్తున్నట్టు ఉందని విమర్శించారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
jupudi
CEC
  • Loading...

More Telugu News