Babu Rajendra Prasad: జగన్ బంధువు ధర్మారెడ్డిపై చేసిన ఫిర్యాదును ఈసీ ఎందుకు పట్టించుకోలేదు?: బాబు రాజేంద్రప్రసాద్ ఫైర్

  • ఫామ్-7పై ఎందుకు చర్య తీసుకోలేదు?
  • చంద్రబాబుపై దాడి చేసేందుకు జగన్ కుట్ర
  • తెలంగాణలో ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదు?

పోలీసు అధికారుల బదిలీలపై ఎలక్షన్ కమిషన్ నిర్ణయం దారుణమని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై భౌతికదాడి చేసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

నాడు తెలంగాణ ఎన్నికల్లో విపక్షాలు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేస్తే ఎందుకు బదిలీ చేయలేదని, ఫామ్-7 దరఖాస్తులపై కూడా ఈసీ ఎందుకు చర్య తీసుకోలేదని రాజేంద్రప్రసాద్ నిలదీశారు. కేంద్ర హోంశాఖలో పని చేస్తున్న జగన్ బంధువు ధర్మారెడ్డి ఎన్నికల అధికారులను ప్రభావితం చేస్తున్నారన్న టీడీపీ ఫిర్యాదును కూడా ఈసీ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

Babu Rajendra Prasad
Jagan
Chandrababu
Telugudesam
YSRCP
Telangana
EC
  • Loading...

More Telugu News