imran khan: భారత్ లో ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఏదో జరగబోతోందనే భయం కలుగుతోంది: ఇమ్రాన్ ఖాన్

  • పుల్వామా ఘటనను మోదీ ఉపయోగించుకుంటారని అనుకున్నా
  • ఎన్నికల్లో గెలవడానికే ఇదంతా చేస్తున్నారు
  • ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి

భారత్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... భద్రతాపరంగా మళ్లీ ఏదో జరగబోతోందనే భయం కలుగుతోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పుల్వామా ఘటన జరిగిన తర్వాత... యుద్ధ వాతావరణాన్ని సృష్టించేందుకు భారత ప్రధాని మోదీ దీన్ని ఉపయోగించుకుంటారని తాను భావించానని... అనుకున్నట్టే జరిగిందని చెప్పారు. ఎన్నికల్లో గెలవడం కోసమే ఇదంతా చేస్తున్నారనే విషయాన్ని భారత ప్రజలు గమనించాలని విన్నవించారు. ఇప్పుడు మళ్లీ ఏదో ఒకటి జరుగుతుందని అనిపిస్తోందని చెప్పారు. ఉపఖండంలోని అసలైన సమస్యలకు దీనికి సంబంధం లేదని అన్నారు. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు.

imran khan
modi
pakistan
india
elections
attacks
  • Loading...

More Telugu News