chandrababu: జగన్ ను అడ్డం పెట్టుకుని శ్రీశైలం జోలికి కేసీఆర్ వస్తే ఊరుకోను: చంద్రబాబు

  • ఏపీ ప్రాజెక్టుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోను
  • వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయలేరు
  • జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే ప్రజలకు రక్షణ ఉండదు

వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ ను అడ్డం పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఏపీ ప్రాజెక్టుల జోలికి వస్తే వదిలిపెట్టనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా... పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఉరకలెత్తిస్తున్నామని... ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండలో రోడ్ షోలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ పై 31 కేసులు ఉన్నాయని... ఆయనను నమ్ముకున్న వారికి జైలే గతి అని చంద్రబాబు అన్నారు. వివేకా హత్య కేసులో రక్తాన్ని తుడిచేయగలరేమో కానీ... సాక్ష్యాలను తారుమారు చేయలేరని చెప్పారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే ఎవరికీ రక్షణ ఉండదని అన్నారు. తప్పులు చేసింది కాక... మనపైనే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.

chandrababu
kcr
jagan
srisailam
Telugudesam
TRS
ysrcp
  • Loading...

More Telugu News