Andhra Pradesh: బంగారంలాంటి నా బ్రదర్ రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు!: మంచు మనోజ్

  • చరణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా
  • ట్విట్టర్ లో స్పందించిన టాలీవుడ్ హీరో
  • శుభాకాంక్షలు తెలిపిన అమితాబ్, రకుల్ ప్రీత్

ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో హీరో మంచు మనోజ్ రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో మంచు మనోజ్ స్పందిస్తూ..‘బంగారం లాంటి నా బ్రదర్ రామ్ చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మనోజ్ తో పాటు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కూడా రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు..

Andhra Pradesh
Telangana
Tollywood
birthday
wishes
manchu manoj
Twitter
Amitabh Bachchan
rakul preet
  • Loading...

More Telugu News