jagan: ఫరూక్ అబ్దుల్లాది నిరాధారమైన ఆరోపణ!: కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్

  • సీఎం కావడానికి రూ. 1500 కోట్లు జగన్ ఆఫర్ చేశారన్న ఫరూక్ అబ్దుల్లా 
  •  ఖండించిన దాసోజు శ్రవణ్ 
  • సీఎం ఎవరిని చేయాలనే విషయంలో సోనియా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ వ్యాఖ్య

తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం తనను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ కు రూ. 1500 కోట్లు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడ్డారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ఖండించారు. వైయస్ మరణానంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల సేకరణతో పాటు, పలు ప్రయత్నాలను జగన్ చేసిన మాట వాస్తవమేనని... అయితే, కాంగ్రెస్ కు రూ. 1500 కోట్లు ఆఫర్ చేశారనేది మాత్రం నిరాధారమైన ఆరోపణ అని అన్నారు.

వైయస్ మరణానంతరం ఎవరిని సీఎం చేయాలనే విషయంలో సోనియాగాంధీ మంచి నిర్ణయం తీసుకున్నారని శ్రవణ్ చెప్పారు. పార్టీ సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారని గుర్తు చేశారు.

jagan
farooq abdullah
congress
1500 crores
offer
dasoju sravan
sonia gandhi
  • Loading...

More Telugu News