Andhra Pradesh: టీడీపీ నేత ఉగ్రనరసింహారెడ్డి ఆసుపత్రిలో కొనసాగుతున్న ఐటీ దాడులు!

  • కీలకపత్రాలు, డాక్యుమెంట్ల పరిశీలన
  • భాగస్వాములు, ఐటీ రిటర్నులపై ఆరా
  • ఉద్యోగులను ప్రశ్నిస్తున్న ఐటీ అధికారులు

తెలుగుదేశం నేత ఉగ్రనరసింహారెడ్డికి చెందిన అమరావతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఈ ఆసుపత్రికి చేరుకున్న ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజాగా రెండో రోజు కూడా అధికారులు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఉద్యోగులను ప్రశ్నించారు.

ఈ ఆసుపత్రిలో భాగస్వాములు ఎవరు? ఆదాయం ఎంత వచ్చింది?  ఐటీ రిటర్నులు సమర్పించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆసుపత్రి ఆర్థిక మూలాలపై లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున ఉగ్రనరసింహారెడ్డి అమరావతి ఆసుపత్రికి రాలేకపోయినట్లు సమాచారం. ఉగ్రనరసింహారెడ్డి ప్రస్తుతం టీడీపీ తరఫున కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

Andhra Pradesh
Telugudesam
ugra narasimha reddy
it raids
  • Loading...

More Telugu News