Andhra Pradesh: నేడు మూడు జిల్లాల్లో జగన్ సుడిగాలి పర్యటన!

  • విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరిలో ఎన్నికల ప్రచారం
  • నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించనున్న జగన్
  • అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన వైసీపీ నేతలు

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ఈరోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు నిర్వహించే బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటారని వెల్లడించాయి.

ఈరోజు ఉదయం 9.30 గంటలకు పార్వతీపురానికి చేరుకోవడంతో జగన్ పర్యటన ప్రారంభం అవుతుంది. అనంతరం ఉదయం 11.30 గంటలకు విశాఖ జిల్లాకు చేరుకోనున్న జగన్ పాయకరావు పేటలో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు జగన్ తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంటారు.

అక్కడే మండపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా జగన్ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ నేతలు ఇప్పటికే పూర్తిచేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
3 districts
tour
Visakhapatnam District
Vijayanagaram District
East Godavari District
  • Loading...

More Telugu News