వాపును చూసి బలుపు అనుకోవద్దు.. నాగబాబుకు సినిమా చూపిస్తాం!: వైసీపీ నేత రఘురామ కృష్ణంరాజు
- ఓటమి భయంతో నాగబాబు పిచ్చిపిచ్చి మాటలు
- ఏపీలో ప్రజలు జగన్ ను కోరుకుంటున్నారు
- నరసాపురంలో మీడియాతో వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వాపును చూసి బలుపు అనుకోవద్దనీ, ఎన్నికల రోజు ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలిసిపోతుందనీ, అప్పటివరకూ వేచి చూడాలని నాగబాబుకు హితవు పలికారు. తాను పార్టీలు మారలేదనీ, సొంత గూటికే తిరిగివచ్చానని తెలిపారు. కానీ మెగాబ్రదర్ నాగబాబు సీపీఎం, సీపీఐ, ప్రజాశాంతి ఇలా ఏడు పార్టీల కండువాలు వేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.