raana: త్వరలోనే సెట్స్ పైకి 'హిరణ్యకశిప'

  • రానా కథానాయకుడిగా 'హిరణ్యకశిప'
  • ముగింపు దశలో ప్రీ ప్రొడక్షన్ పనులు 
  • జూన్ నుంచి సెట్స్ పైకి  

బలమైన కథాకథనాలతో .. భారీ నిర్మాణ విలువలతో విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడిగా గుణశేఖర్ కి మంచి పేరుంది. 'రుద్రమదేవి' తరువాత ఆయన 'హిరణ్యకశిప' అనే సినిమాను రూపొందించనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ఒక వార్త షికారు చేసింది. రానా కథానాయకుడిగా సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా చెప్పుకున్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ బయటికి రాకున్నా, సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు చకచకా జరిగిపోతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పై  'సెవెంటీన్ వీఎఫెక్స్ స్టూడియో' వారు తమకి అప్పగించిన పనులను కానిచ్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్ లో ఈ సినిమాను లాంచ్ చేసి .. ఆ తరువాత రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా సమాచారం. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. 

raana
gunasekhar
  • Loading...

More Telugu News