Bihar: మందుకొట్టి వచ్చి నామినేషన్ వేసిన అభ్యర్థి.. తీసుకెళ్లి జైల్లో వేసిన పోలీసులు!

  • బీహార్‌లో అమల్లో ఉన్న మద్య నిషేధం
  • నామినేషన్ పత్రాలు దాఖలు చేశాక అరెస్ట్ 
  • జైలుకు తరలించిన పోలీసులు

ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ నాయకుడిగా చక్రం తిప్పాలనుకున్న ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. బీహార్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. నామినేషన్ వేయడానికి వచ్చిన సదరు వ్యక్తి పూటుగా తాగి ఉండడమే అందుకు కారణం. పూర్తిగా మద్య నిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో మందుకొట్టి నామినేషన్ వేసేందుకు రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

40 ఏళ్ల రాజీవ్ కుమార్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని భావించాడు. అనుకున్నదే తడవుగా నామినేషన్ పత్రాలతో ప్రత్యక్షమయ్యాడు. అయితే, అతడు పూర్తిగా మద్యం మత్తులో ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వచ్చారా? అన్న పోలీసుల ప్రశ్నకు సింగ్ ఏమాత్రం తొణక్కుండా ‘అవును’ అని సమాధానం ఇచ్చాడు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న అతడిని నామినేషన్ దాఖలు చేసిన తర్వాతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

Bihar
liquor
Election
Nomination
police
arrest
  • Loading...

More Telugu News