Srisailam: శ్రీశైలానికి పాదయాత్రగా వెళుతుంటే... లారీ రూపంలో కబళించిన మృత్యువు!

  • కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం
  • నిద్రమత్తులో వాహనాన్ని నడిపిన డ్రైవర్
  • ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

కర్ణాటకకు చెందిన శివభక్తులు శ్రీశైలానికి పాదయాత్రగా వస్తుంటే, లారీ రూపంలో వచ్చిన మృత్యువు ముగ్గురిని కబళించింది. ఈ ఉదయం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల సమీపంలో ఈ ఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన 20 మంది శివభక్తులు, గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తూ, శ్రీశైలానికి వెళుతున్నారు.

నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ వారిని గమనించకుండా, వాహనాన్ని నడపటంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిని పోతులింగ (23), షేక్ (16), ఉలిగయ్య (30)లుగా గుర్తించారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.

Srisailam
Road Accident
Kurnool District
Kappatralla
  • Loading...

More Telugu News