Smartphone: జేబులో పేలిన స్మార్ట్ ఫోన్... ఒప్పోపై కేసు!

  • రెండు రోజుల క్రితం కొత్త ఫోన్
  • బైక్ పై వెళుతుంటే పేలిన ఫోన్
  • యువకుడి తొడకు తీవ్రగాయాలు

ఎంతో ముచ్చటపడి రెండు రోజుల క్రితం కొనుక్కున్న ఒప్పో కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ అతని ప్రాణాలను తీయబోయింది. స్మార్ట్ ఫోన్ ప్యాంట్ జేబులో ఉండబట్టి, తొడకు తీవ్రగాయాలతో అతను ప్రాణాలు దక్కించుకున్నాడుగానీ, అదే షర్ట్ జేబులో ఉండుంటే ప్రాణాలే పోయేవి.

హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాల్లోకి వెళితే, అరటిపళ్ల వ్యాపారం చేసుకుంటున్న అల్వాల్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (25), తన బంధువుల అమ్మాయిని టెన్త్ పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి, తిరిగి తీసుకుని వస్తున్న సమయంలో ప్యాంట్ జేబులో పెట్టుకున్న ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అతను బైక్ పైనుంచి పడిపోగా, తలకు కూడా గాయమైంది. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. ఒప్పో కంపెనీపై బొల్లారం పోలీసులకు ఇమ్రాన్ ఫిర్యాదు చేశాడు.

Smartphone
Blast
Hyderabad
Oppo
  • Loading...

More Telugu News