ysrcp: వైసీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ

  • టీడీపీ హయాంలో పేదలకు తీరని అన్యాయం జరుగుతోంది
  • ప్రభుత్వ పథకాలు ఆ పార్టీ కార్యకర్తలకే పరిమితమయ్యాయి
  • జగన్ సీఎం కావడం ఖాయం

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి బేషరతుగా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టు నేషనల్ కమ్యునిస్ట్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృపాసత్యం తెలిపారు.

పార్టీ సహాయకార్యదర్శి కరణం సరస్వతి, అధికార ప్రతినిధి మందా భూషణంలతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పథకాలు కేవలం పార్టీ కార్యకర్తలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జగన్ గాలి వీస్తోందని, ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ కనీసం 15 స్థానాల్లో గెలుపొందుతుందని, కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

ysrcp
ncp
support
Telugudesam
  • Loading...

More Telugu News