nara lokesh: ఉత్కంఠకు తెర.. నారా లోకేశ్ నామినేషన్ కు ఆమోదం

  • లోకేశ్ నామినేషన్ కు నోటరీ సమస్య
  • అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ అభ్యర్థి ఆర్కే
  • లోకేశ్ తరపు లాయర్ వివరణతో సంతృప్తి చెందిన అధికారి

ఏపీ మంత్రి నారా లోకేశ్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్ వేసిన నామినేషన్ పై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నోటరీ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం లోకేశ్ నామినేషన్ చెల్లదని వారు తెలిపారు. కృష్ణా జిల్లా చిరునామాతో ఉన్న నోటరీ... గుంటూరు జిల్లాలో చెల్లదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఉండవల్లిలోని ఇంటి అడ్రస్ ను నామినేషన్ లో లోకేశ్ సమర్పించారు. అయితే నోటరీ చేసింది మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన లాయర్ సీతారామ్. దీంతో, గుంటూరు జిల్లా తన పరిధిలోకి రానప్పుడు సీతారామ్ నోటరీ ఎలా చేస్తారని వైసీపీ అభ్యర్థి ఆర్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని లోకేశ్ తరపు న్యాయవాది ఎన్నికల అధికారిని కోరారు. ఆ తర్వాత వారు ఇచ్చిన వివరణతో ఎన్నికల అధికారి సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది.

nara lokesh
nomination
mangalagiri
Telugudesam
  • Loading...

More Telugu News