kupam: కురుపాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

  • జనార్దన్ కులధ్రువీకరణ పత్రంపై బీజేపీ అభ్యర్థి అభ్యంతరం
  • హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన పత్రాన్నే పొందుపరిచారంటూ ఫిర్యాదు
  • నామినేషన్ ను తిరస్కరించాలంటూ విన్నపం

తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వీటీ జనార్దన్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వివరాల్లోకి వెళ్తే, నామినేషన్ లో జనార్దన్ కులధ్రువీకరణ పత్రంపై బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

2013లో జారీ అయిన ఎస్టీ సర్టిఫికెట్ ను అధికారులు పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పుబట్టారు. ఆయన ఎస్టీ కాదని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను చూపించారు.. ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో జనార్దన్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. దీంతో, డమ్మీ అభ్యర్థిగా నరసింహ ప్రియా థాట్రాజ్ పేరును టీడీపీ ప్రకటించింది.

kupam
Telugudesam
janardhan
nomination
reject
  • Loading...

More Telugu News