TRS: టీఆర్ఎస్ కు ఊహించని ఎదురుదెబ్బ.. సిట్టింగ్ ఎమ్మెల్సీ ఓటమి

  • టీఆర్ఎస్ బలపరిచిన ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటమి
  • అలుగుబెల్లి నర్సిరెడ్డి ఘన విజయం
  • అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న ఎన్నికల సంఘం

శాసనసభలో ఎన్నికల్లో స్వీప్ చేసి, లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉరకలేస్తున్న టీఆర్ఎస్ కు ఊహిచని షాక్ తగిలింది. ఉపాధ్యాయుల కేటగిరిలో ఆ పార్టీ బలపరిచిన తెలంగాణ పీఆర్టీయూ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటమిపాలయ్యారు. తెలంగాణ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 18,885 ఓట్లు పోలవగా.... పూల రవీందర్ కు 6,279 ఓట్లు వచ్చాయి. 8,976 ఓట్లతో నర్సిరెడ్డి ఘన విజయం సాధించారు. నర్సిరెడ్డి గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

TRS
mlc poola ravinder
lost
narsireddy
  • Loading...

More Telugu News