Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డారు: జగదీశ్‌రెడ్డి

  • ఉత్తమ్‌పై జగదీశ్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు
  • నమ్మకం లేకనే రాజీనామా చేయలేదు
  • టీడీపీకి పట్టిన గతే పడుతుంది

అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డారని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడానికి కారణం, లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై నమ్మకం లేకనేనని సెటైర్ వేశారు. టీడీపీకి పట్టిన గతే భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు కూడా పడుతుందని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.

Congress
Parliament
Jagadeesh Reddy
Uttam Kumar Reddy
Telugudesam
  • Loading...

More Telugu News