Srikakulam District: ఆరు నూరైనా చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • బాబును మళ్లీ సీఎం కాకుండా ఆపడం ఎవరి తరం కాదు
  • చంద్రన్న వెంటే అందరూ ఉన్నారు
  • ఐదేళ్ల పాటు టీడీపీ కష్టపడింది

ఆరు నూరైనా చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని హరిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా ఆపడం ఎవరి తరం కాదని, ఎందుకంటే, చంద్రన్న వెంటే అందరూ ఉన్నారని, ముఖ్యంగా మహిళలందరూ ఉన్నారని, వారు తలచుకుంటే సాధించలేనిది లేదని ప్రశంసించారు. ఐదేళ్ల పాటు తెలుగుదేశం పడిన కష్టానికి ఫలితంగా మళ్లీ టీడీపీనే గెలిపించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్న తనను మళ్లీ గెలిపించాలని, జరగబోయే ఎన్నికలు చరిత్రాత్మకమైనవని, తమ పార్టీని గెలిపించాల్సిన అవసరం ప్రజలపై ఉందని అన్నారు. పదవుల కోసం కాదు, ఏపీ అభివృద్ధి , రాజధాని నిర్మాణం, పిల్లల భవిష్యత్, రైల్వేజోన్ సాధన కోసం తమ పార్టీని గెలిపించాలని అన్నారు.

Srikakulam District
palasa
Telugudesam
mp
Ram mohan
  • Loading...

More Telugu News