Andhra Pradesh: జగన్ కు సిగ్గులేదేమో, మాకు ఉంది: టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్

  • జగన్, కేసీఆర్ లు తమ స్వార్థం కోసం కలిశారు
  • వెయ్యి కోట్ల కోసం కేసీఆర్ తో కలిస్తే తప్పేంటంటావా?
  • ఆంధ్రా ప్రజలను కేసీఆర్ తిట్టిన తిట్లు మరిచిపోయావా జగన్?

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతుగా ఉన్నారని జగన్ చెప్పడం దారుణమని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ మద్దతిచ్చింది ‘ప్రత్యేక హోదా’ కు కాదని జగన్ కు అని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రానికే వెళ్లి పోతే తెలంగాణ పరిస్థితి ఏం కావాలని హరీశ్ రావు ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వొద్దని టీఆర్ఎస్ పార్టీ నేతలు అంత స్పష్టంగా చెబుతుంటే, ఇంకా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఎలా అభినందిస్తారని ప్రశ్నించారు. జగన్, కేసీఆర్ లు తమ స్వార్థం కోసం కలిశారని, ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్ ఇచ్చే ముష్టి వెయ్యి కోట్ల కోసం ఆయనతో కలిస్తే తప్పేంటని అంటావా? అని జగన్ పై విరుచుకుపడ్డారు. ‘ఆంధ్రా ప్రజలను కేసీఆర్ తిట్టిన తిట్లు మరిచిపోయావా జగన్? జగన్ మోహన్ రెడ్డి గారూ, మీకు సిగ్గులేదేేమో, మాకు సిగ్గూశరం, రోషం, పౌరుషం ఉన్నాయి’ అని అన్నారు.

Andhra Pradesh
Telangana
kcr
Chandrababu
Telugudesam
Babu Rajendra prasa
Harish Rao
  • Loading...

More Telugu News