anil kumar yadav: బెట్టింగులు మానేసి.. నా అభిమానివని చెప్పుకో: వైసీపీ అభ్యర్థిపై పవన్ ఫైర్

  • అనిల్ కుమార్ యాదవ్ నా అభిమాని అని చెప్పుకుంటాడు
  • రెండు, మూడు సార్లు నన్ను కలిశాడు
  • నెల్లూరు వైసీపీ నేతలు ఎమ్మెల్యేలా లేక బెట్టింగ్ ఎక్స్ పర్టులా?

నెల్లూరు వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఈరోజు నెల్లూరులో ఆయన ప్రసంగిస్తూ, అనిల్ కుమార్ యాదవ్ తన అభిమాని అని చెప్పుకుంటుంటాడని... రెండు, మూడు సార్లు తనను కలిశాడని తెలిపారు. 'అనిల్.. నువ్వు బెట్టింగులు మానేసి... నా అభిమానివని చెప్పుకో' అని సూచించారు.

 నెల్లూరులో బరిలో ఉన్న వైసీపీ నేతలు ఎమ్మెల్యేలా? లేక బెట్టింగ్ ఎక్స్ పర్టులా? అని పవన్ ప్రశ్నించారు. ఏ పార్టీ జెండా ఎగురుతుంది అనే విషయంపై కూడా వీరు బెట్టింగులు ఆడుతారని విమర్శించారు. ఇలాంటి వారికి రాజకీయాలు అనవసరమని... క్లబ్బుల్లో కూర్చొని పేకాట, బెట్టింగులు ఆడుకోవాలని అన్నారు. మరోవైపు, పలు ఇంటర్వ్యూలలో తాను పవన్ అభిమానినని అనిల్ చెప్పారు. అంతేకాదు, ఓ సందర్భంలో పవన్ ను విమర్శిస్తూ... తాను పవన్ అభిమానిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని కూడా ఆయన అన్నారు.

anil kumar yadav
ysrcp
nellore
Pawan Kalyan
janasena
  • Loading...

More Telugu News