Nellore District: వైసీపీ నేతలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలి: పవన్ కల్యాణ్

  • నెల్లూరు జిల్లా కోవూరులో ‘జనసేన’ ఎన్నికల ప్రచారం
  • ఏపీ పోలీస్ పై నమ్మకం లేదన్న జగన్ వ్యాఖ్యలు తగదు
  • రాష్ట్రంలోని యువత మార్పు కోరుకుంటోంది   

వైసీపీ నేతలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హితవు పలికారు. నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వారిని జగన్ అవమానపరుస్తున్నారని, ఇలాంటి విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. రాజకీయం అంటే బెట్టింగ్ అయిపోయిందని, ఈ విషయంలో మార్పు రావాలని కోరారు. రాష్ట్రంలోని యువత మార్పు కోరుకుంటోందని అన్నారు.

Nellore District
kovuru
Janasena
Pawan Kalyan
  • Loading...

More Telugu News