Uttar Pradesh: బీజేపీలో చేరిన సినీ నటి జయప్రద

  • జయప్రదకు బీజేపీ నేతల అభినందనలు
  • మోదీ నేతృత్వంలో పని చేయడం అదృష్టం 
  • రాంపూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ

యూపీ మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటి జయప్రద బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కండువాను కప్పి పార్టీలోకి జయప్రదను ఆహ్వానించారు. పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. జాతీయ పార్టీ బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని, తన జీవితంలో ముఖ్యమైన ఘట్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశం కోసం పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు జయప్రద చెప్పారు. యూపీలోని రాంపూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నట్టు సమాచారం. కాగా, రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరపున ఆమె గతంలో పోటీ చేశారు. తిరిగి ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగనున్నారు. టీడీపీలో కానీ, వైసీపీలో కానీ జయప్రద చేరతారని ఓ దశలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Uttar Pradesh
BJP
JayaPrada
Artist
  • Loading...

More Telugu News